తమిళనాడు నుంచి వస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను మరింత సమర్థవంతంగా అడ్డుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా ఆదేశించారు. తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు కార్యదళం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అనంతరం అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డీఎఫ్ఓ పవన్ కుమార్ రావు, ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం డీఎస్పీలు పాల్గొన్నారు.
స్మగ్లర్లను అడ్డుకునేందుకు చర్యలపై.. అనంతపురం రేంజ్ డీఐజీ సమీక్ష - తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లింగ్ తాజా వార్తలు
తిరుపతిలో టాస్క్ ఫోర్స్ అధికారులతో అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు కార్యదళం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. ఎర్రచందనం స్మగ్లర్లను మరింత సమర్థవంతంగా అడ్డుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
అనంతపురం రేంజ్ డీఐజీ సమీక్ష