ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు శిక్షణ కళాశాలలో ఆనందయ్య మందు పంపిణీ

చంద్రగిరి పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న పోలీసులకు ఆనందయ్య మందును ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారనే.. ఈ మందులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

anandayya medicine distribution
ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jun 17, 2021, 10:30 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి.. ఆనందయ్య మందును పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా శానిటైజర్ లు, మాస్కులతో పాటు.. కొవిడ్​కు సంబంధించి మందులు అందరికీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారనే.. ఈ మందులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

శిక్షణ కేంద్రంలో అధునాతన ఆడిటోరియానికి, పర్యావరణ పరిరక్షణకు తుడా నిధులతో ఏర్పాటుకు అవసరమైన అంచనా మొత్తం సిద్ధం చేసి పంపాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ బాబుకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాధమ్మ, ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details