రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కరోనా నివారణ మందును అందిస్తామని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఆనందయ్య చిత్తూరు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... సామాజిక సేవా కార్యకర్తల ద్వారా త్వరలో ప్రతి జిల్లాకు ఆయుర్వేద మందును పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిత్తూరులో కరోనా ఔషధం అందించే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించినట్లు చెప్పారు.
చిత్తూరులో కరోనా మందు పంపిణీపై మంత్రి పెద్దిరెడ్డితో చర్చించాను: ఆనందయ్య
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కరోనా నివారణ మందును పంపిణీ చేయనున్నట్లు కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఔషధం అందించే విషయంపై మంత్రి పెద్దిరెడ్డితో చర్చించినట్లు చెప్పారు.
ఆనందయ్య
తన పేరిట కరోనా నివారణ మందును తయారు చేసి వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారని ఆనందయ్య తెలిపారు. ఆ మందులను వినియోగించి.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెబుతున్నారన్నారు. దానితో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
ఇదీ చదవండి:కొవిడ్ మరణాలు.. వాస్తవాలను ప్రభుత్వం దాస్తోంది: కూన రవికుమార్