చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ దారిలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తిరుపతికి వస్తున్న మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు పది అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. 23 మంది ప్రయాణికులు ఉండగా అందులో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
BUS ACCIDENT: లోయలో పడ్డ బస్సు.. నలుగురికి గాయాలు - bakara peta latest news
![BUS ACCIDENT: లోయలో పడ్డ బస్సు.. నలుగురికి గాయాలు accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12776750-344-12776750-1628991222507.jpg)
accident
06:16 August 15
డ్రైవర్‌కు తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలు
అతివేగమే ప్రమాదానికి కారణం..
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న ఆర్టీసీ ఆధికారులు, పోలీసులు క్షతగ్రాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. భాకరాపేట కనుమదారిలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి:పీలేరులో అక్రమ కట్టడాలు కూల్చివేత
Last Updated : Aug 15, 2021, 7:29 AM IST