తిరుపతి రూరల్ మండలం పేరూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం, జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.తిరుపతి సింగాలగుంటకు చెందిన సరోజమ్మ(70) భర్త మునస్వామి నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి పేరూరులోని పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సరోజమ్మ మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటంబ సభ్యులు తెలిపారు.సమాచారం అందుకున్న ఎం.ఆర్ పల్లి పోలీసులు శనివారం ఉదయం గజఈతగాళ్ళు సహాయంతో వెలికితీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జీవితంపై విరక్తితో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య - An old woman commits suicide by jumping into a well with aversion to life
ఆ వృద్ధురాలి భర్త నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. కుమారుడి ఇంట్లో ఉంటున్న 70ఏళ్ల సరోజమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
జీవితంపై విరక్తితో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
TAGGED:
వృద్ధురాలు ఆత్మహత్య........