చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్టీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఇంట్లో ప్రతిరోజు కూతకూసి నిద్రలేపే కోడిపుంజు మరో కోడిపుంజుతో తిరుగుతుండటాన్ని యజమాని గమనించాడు. కొద్దిరోజులకే కోడిపుంజు గుడ్డు పెట్టడాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. వరుసగా 11 గుడ్లు పెట్టింది. గుడ్లు పొదిగి 5 పిల్లలను చేసి సంరక్షిస్తోంది. స్థానిక పశువైద్యాధికారి నారాయణను వివరణ కోరగా ఒక్కోసారి జన్యులోపంవల్ల ఇలా జరుగుతుందన్నారు.
ఇది విన్నారా..! గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగిన కోడిపుంజు - hen lays eggs in Peddakannali
కోడిపుంజు మరో కోడిపుంజుతో తిరుగటాన్ని ఎప్పుడైన చూశారా? పోనీ కోడిపుంజు గుడ్డు పెట్టడం? ప్రకృతి విర్ధుమైన మాటలు చెప్పకండి అంటారా.. కానీ ఇవి జరిగాయి. అవును మీరు విన్నది నిజమేనండీ.. ఓ కోడిపుంజు మరో కోడిపుంజుతో జతకట్టి ఏకంగా 11గుడ్లు పెట్టింది.
hen laying eggs