చిత్తూరు జిల్లాలో ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకున్నారు. తంబళ్ళపల్లె ప్రాంతంలో బాలికలు, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింత, యువతుల సంరక్షణ, విద్య, వైద్యం, రక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా... బడుగు బలహీనవర్గాలపై వివక్ష... అసమానతల వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయాలు... గ్రామీణ కళల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. కళాకారులతో కలిసి నృత్యం చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాల గురించి తెలుసుకున్నారు.
అమెరికా విద్యార్థులతో... తంబళ్లపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమెరికాలోని ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు ప్రతి ఏటా క్షేత్రస్థాయి పర్యటనకు వస్తారని... తుమ్మలపల్లి పోర్ట్, బెంగళూరుకు చెందిన బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తెలిపారు.