చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను దళిత ఐక్యవేదిక అంబేడ్కర్ ఆశయ పోరాట సమితి ఘనంగా నిర్వహించింది. ఆ సంఘం నాయకులు రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీవో దివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకట్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.