Amaravathi Farmers Mahapadayatra: అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. చివరి రోజు జన సంద్రాన్ని తలపిస్తూ ముందుకు సాగుతోంది. అడుగడుగునా గోవిందా స్మరణతో రైతులు తిరుపతి వీదుల్లో తమ నడకను ప్రారంభించారు. వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కుల, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానికులు పాదయాత్రకు మద్దతుగా తరలి వచ్చారు.
తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు, పుంగనూరు నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు రైతుల వెంట పాదం కదిపారు. అమరావతి రాజధానికే రాయలసీమ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని నల్లారి కిశోర్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర మధ్యాహ్నానికి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, ఇతర నేతలు రైతులకు స్వాగతం పలికి, పాదయాత్రకు మద్దతు పలికారు.
44 రోజులు 400 కిలోమీటర్లు..
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవంబర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులుగా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైకాపా మినహా..అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు. పేరు చెప్పుకోకుండా మండల స్థాయి వైకాపా నేతలు పలుచోట్ల పాదయాత్రకు నైతిక మద్దతు ప్రకటించారు.
భారీ బహిరంగ సభ..