హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని తమ పరిశ్రమల్లో పనులను తిరిగి ప్రారంభించినట్లు అమర రాజా యాజమాన్యం ప్రకటించింది. జిల్లాలోని కరంకంబాడీ, నూనెగుండ్లపల్లి యూనిట్లలో ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ పునరుద్ధరించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిశ్రమలో సాధారణ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు ప్రకటన విడుదల చేశారు. కాలుష్యనియంత్రణ మండలితో చర్చించేందుకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేందుకు సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. చిన్నపాటి విరామం వచ్చినా.. ఆ ప్రభావం సంస్థపై పడలేదని చెప్పారు.