ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలకు శ్రీవారి టికెట్లు కేటాయింపు - తితిదే వార్తలు

తిరుమలకు భక్తులను తీసుకువచ్చే వివిధ రాష్ట్రాల టూరిజం సర్వీసులకు..తితిదే టికెట్లు విడుదల చేసింది. రోజుకు 2,250 టిక్కెట్లను వివిధ టూరిజం శాఖలకు కేటాయిస్తూ ఆర్జితం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది

Allotment of Srivari tickets to various state tourism departments
వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలకు శ్రీవారి టికెట్లు కేటాయింపు

By

Published : Feb 2, 2021, 1:09 PM IST

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తితిదే దశలవారీగా పెంచుతోంది. ఇందులో భాగంగా తిరుమలకు భక్తులను తీసుకువచ్చే వివిధ రాష్ట్రాల టూరిజం సర్వీసులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేసింది. రోజుకు 2,250 టికెట్లను వివిధ టూరిజం శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఏపీఎస్ ఆర్టీసీ వోల్వో సర్వీసులకు రోజుకు 1000 టికెట్లు , తెలంగాణ టూరిజానికి 350, ఐఆర్‌సీటీసీకి 250, ఎయిర్ ఇండియాకు 100, తమిళనాడు టూరిజానికి 150, కర్ణాటక టూరిజానికి 200, ఐటీడీసీకి 100, గోవా టూరిజానికి 100 టికెట్ల చొప్పున జారీ చేశారు.

ఏపీఎస్​ఆర్టీసీలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని... ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమల ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి.

గూడ్స్‌ రైళ్ల కోసం ప్రత్యేక కారిడార్లు, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details