తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని బీటీఆర్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని సుమారు 30 ద్విచక్రవాహనాలు గుర్తించారు. బీటీఆర్ కాలనీ, లక్ష్మీపురం, అన్నపూర్ణమ్మ కాలనీలలో ఈ సోదాలు కొనసాగాయి. ప్రతి ఇంటి వద్ద ఉన్న వాహన పత్రాలను పరిశీలించి.. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అప్పుడప్పుడు ఇలా వాహన తనిఖీలకు అనుకోకుండా వస్తామని.. వాహనదారులు అన్నీ పత్రాలను తమవద్ద ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సీజ్ చేసిన వాహనాలకు సరైన పత్రాలను చూపించి తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.