చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ సోమల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నో దశాబ్దాలుగా 11,225 ఎకరాల రెవెన్యూ, అటవీశాఖ భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ లెక్కల ప్రకారం ఉన్న సరిహద్దులు, అటవీశాఖ భూముల రికార్డులూ తారుమారు చేశారు. భూములను ఆక్రమించాలనే రికార్డులు తారుమారు చేసినట్లు అధికారుల బృందం తేల్చింది. అటవీశాఖ భూముల రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు ఇది బయటపడింది. ఫిర్యాదులు రావడంతో విచారించి, రెవెన్యూ దస్త్రాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని 2019 ఆగస్టులో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ఆదేశించారు. అధికారుల బృందం పరిశీలించి నివేదిక సమర్పించిందని మదనపల్లె ఆర్డీవో తెలిపారు.
ఆక్రమించేందుకు... రికార్డులు తారుమారు - somala villages land alienation
చిత్తూరు జిల్లా మదనపల్లెలో దశాబ్దాలుగా రెవెన్యూ, అటవీశాఖల భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల బృందం తేల్చింది. భూములు ఆక్రమించాలనే... రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు.
రెవెన్యూ, అటవీశాఖ భూములు అన్యాక్రాంతం