ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీలేరులో అక్రమ కట్టడాలు కూల్చివేత

By

Published : Aug 14, 2021, 1:54 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

akrama_kattadalu_kulchivetha_at pileru
పీలేరులో అక్రమ కట్టడాలు కూల్చివేత

పీలేరు-తిరుపతి మార్గంలోని సర్వేనెంబర్ 901లో వెలసిన అక్రమ కట్టడాలతో పాటు అసైన్డ్ మరియు రోడ్లు భవనాల శాఖకు చెందిన భూముల్లో ఆక్రమించుకున్న వాటిని జెసిబిలతో కూల్చివేసే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు చేపట్టారు. మదనపల్లి డివిజన్​లోని పీలేరు వాల్మీకిపురంలో పోలీసు బలగాలను భారీ స్థాయిలో మొహరించారు.

మండల పరిధిలోని బోడుమల్లువారిపల్లె, దొడ్డిపల్లి, ఎర్రగుంటపల్లి, ముడుపుల వేముల పంచాయతీలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ భవనాల నిర్మాణాలు భారీ ఎత్తున జరిగాయి.

అక్రమ నిర్మాణాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పత్రికాముఖంగా ఆక్రమిత భూములు, అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గతంలో ఆరోపించగా.. 2010 నుంచి ఇప్పటివరకు పీలేరు మండలంలో జరిగిన భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ జాహ్నవి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ భవన నిర్మాణాలను గుర్తించి రెవెన్యూ అధికారులు నివేదికను అందజేశారు. దీంతో పోలీసుల సహకారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ భవన నిర్మాణాల కూల్చివేత పనులను ప్రారంభించారు.

ఇదీ చదవండి:

LORRIES STRANDED IN FLOOD: ఇసుక కోసం వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు

ABOUT THE AUTHOR

...view details