చిత్తూరు జిల్లా తొట్టంబేడులోని కజేరియా పరిశ్రమలో పనిచేస్తున్న ఇంజినీర్ మృతి చెందాడు. కజేరియా పరిశ్రమలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన శంభు ప్రసాద్ తన గదిలో విగతజీవుడుగా పడి ఉండటాన్ని గమనించిన తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు.
అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీర్ మృతి - తొట్టంబేడు కజేరియా పరిశ్రమలో పనిచేస్తున్న ఇంజినీర్ మృతి వార్తలు
చిత్తూరు జిల్లా తొట్టంబేడులోని కజేరియా పరిశ్రమలో పనిచేస్తున్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీర్ శంభుప్రసాద్ మృతిచెందాడు. అతని మృతికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
![అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీర్ మృతి ahmadabad engineer died in thottambedu chittore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7368685-327-7368685-1590578852068.jpg)
మృతిచెందిన ఇంజినీర్ శంభుప్రసాద్
అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో శంభు ప్రసాద్ చేయించుకున్న కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అతని మృతికి గల కారణలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి... గుంటూరు జిల్లాలో వింత దొంగతనం..!
TAGGED:
thottambedu kajeria factory