చిత్తూరు జిల్లా కుప్పం పోలీసు స్టేషన్ ఎదుట స్థానికుల ఆందోళన చేశారు. విగ్రహాల ధ్వంసం కేసులో తెదేపా వర్గీయులను అదుపులోకి తీసుకున్నారని ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతలు, స్థానికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'మాకేం సంబంధం లేదు'
విగ్రహాల ధ్వంసం ఘటనతో తెదేపాకు సంబంధం లేదని వెల్లడించారు. విగ్రహాల ధ్వంసం కేసుపై కుప్పంలో ఎస్పీ సెంథిల్ కుమార్ సమీక్షించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా వదిలి పెట్టేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ
:'చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు ఇవ్వాలి'