చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో అడ్వెంచర్ ఫెస్టివల్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఎత్తైన కొండలు, గుట్టలతో ఉండి.. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో.. తొలిసారిగా సాహస క్రీడలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యటక శాఖ, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో సాహస క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. బెంగళూరు, చెన్నై, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రవాణా సదుపాయాన్ని అధికారులు కల్పించారు. హాజరయ్యే వారికి వసతి సదుపాయాలు ఏర్పాటుచేశారు.
హార్స్లీ హిల్స్‌లో అడ్వెంచర్ ఫెస్టివల్ - హార్స్లీ హిల్స్ లో అడ్వెంచర్ ఫెస్ట్
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. పర్యటక శాఖ, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ వేడుక ఏర్పాటు చేశారు.
హార్స్లీ హిల్స్‌పై అడ్వెంచర్ ఫెస్టివల్