పాలలో యూరియా, నూనె కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న ఓ వ్యాపారి నిర్వాకాన్ని ఆహార భద్రతా అధికారులు బయటపెట్టారు. గ్రామస్థుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం చిన్న గోరంట్ల పల్లెలో.. సంజీవరెడ్డి అనే వ్యక్తికి చెందిన పాల కేంద్రంపై దాడులు చేసిన ఆహార భద్రత అధికారులు విస్తు పోయే వాస్తవాలు గుర్తించారు.
నకిలీపాల తయారీ..
పాలపొడి, సల్ఫర్, యూరియా, పామాయిల్ వంటి పదార్థాలతో నకిలీ పాలను తయారు చేస్తున్నాడు. వీటిని కలపడం వల్ల పాలు చిక్కగా ఉండటంతో పాటు వెన్న శాతం కూడా అధికంగా వస్తోంది. ఫలితంగా అధిక మొత్తంలో నకిలీ పాలు తయారు చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నాడని ఆహార భద్రత అధికారులు చెప్పారు. నిందితుడి నుంచి కల్తీ పాలు, సామాగ్రి, మిక్సర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి:
మదనపల్లెలో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి