చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కామధేనువు అధికార నంది వాహనంపై పురవిధుల్లో ఆదిదంపతులను ఊరేగించారు. అధికార నంది వాహనంపై సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి కొలువుదీరి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అధికారం, నగదు ప్రాప్తి చెందాలని భక్తులు దర్శించుకున్నారు. కోలాటాలు, భజనలతో అలరించారు.
అధికార నందిపై ఆదిదేవుడి రాజసం - అధికార నందిపై ఆదిదంపతుల ఊరేగింపు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కామధేనువు అధికార నంది వాహనంపై ఆది దంపతులు పురవీధుల్లో ఊరేగారు.
అధికార నందిపై ఆదిదేవుడి రాజసం