ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో ఓటమికి ముఖ్య నేతలే కారణం: తెదేపా కార్యకర్తలు - kuppam latest news

కుప్పం నియోజకవర్గ తెదేపా ముఖ్య నేతల తీరుపై కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల ఓటమికి ప్రధాన నేతలే కారణమని మండిపడ్డారు.

Kuppam Tdp leaders meeting
కుప్పంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సమావేశం

By

Published : Feb 23, 2021, 4:34 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలు వేడి రాజేశాయి. ఈనెల 25 నుంచి 3రోజుల పాటు కుప్పంలో... చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై నేతలు సమావేశం నిర్వహించగా... కొందరు కార్యక‌ర్తలు పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. చాలాచోట్ల ఓటమికి ముఖ్యనాయకుల తీరే కారణమని మండిపడ్డారు. తెలుగుదేశం కుప్పం నియోజకవర్గ బాధ్యులు మునిరత్నం... చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఎమ్మెల్సీ శ్రీనివాసు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details