ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లె ఘటన: పోలీసుల అదుపులో నిందితులు - మదనపల్లె ఘటన

మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన యువతుల తల్లిదండ్రులను పోలీస్​ స్టేషన్​కి విచారణ నిమిత్తం తరలించారు.

Accused in police custody in Madanapalle incident
మదనపల్లె ఘటన: పోలీసుల అదుపులో నిందితులు

By

Published : Jan 26, 2021, 11:59 AM IST

Updated : Jan 26, 2021, 2:49 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన యువతుల తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజలను మదనపల్లి తాలుకా పోలీస్​ స్టేషన్​కి విచారణ నిమిత్తం తరలించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నిందితులను విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మదనపల్లె ఘటన హత్య కేసులో ఏ-1గా పురుషోత్తం, ఏ-2 పద్మజగా పేర్కొన్నారు. కాసేపట్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి నిందితులను తరలించనున్నారు. అనంతరం జడ్జి ఎదుట వారిని పోలీసులు హాజరుపరచనున్నారు.

Last Updated : Jan 26, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details