ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో హత్యాయత్నం కేసు.. 9 మంది అరెస్ట్ - తిరిపతిలో బెల్ట్ మురళీ హత్య వార్తలు

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ హత్యాప్రయత్నం కేసులో 9 మంది ముద్దాయిలను ఒక బాలనేరస్థుడుని అదుపులోకి తీసుకున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి పేర్కొన్నారు.

accused arrest in belt murali murder case at tirupati
తిరిపతిలో బెల్ట్ మురళీ హత్య కేసులో నిందితుల అరెస్ట్

By

Published : Oct 19, 2020, 10:36 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలో హత్యాయత్నం కేసులో 9 మంది ముద్దాయిలను, ఓ బాల నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది తిరుపతిలో సంచలనం రేపిన పసుపులేటి మురళీ కృష్ణ అలియాస్ బెల్ట్ మురళీ హత్య కేసులో ఏ-2గా ఉన్న మల్లికార్జున్.. అతనికి ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా పరిశీలించి సోమవారం ఉదయం అనుమానాస్పదంగా ఉన్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో మల్లికార్జున అనే వ్యక్తిని హత్య చేయాలని అనుకున్నామని నిందితులు చెప్పగా.. వారిని అరెస్టు చేశారు. వారి నుంచి ఓ కారు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదుచేసి రిమాండ్​కి తరలించామని ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details