ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BRS 2022 Audit Report : ఏడాదిలో భారీగా పెరిగిన తెరాస ఆదాయం - బీఆర్​ఎస్​ ఆదాయం

BRS 2022 Audit Report : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న బీఆర్​ఎస్.. ఆదాయపరంగానూ అత్యంత వేగంగా దూసుకుపోతుంది.​ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్​ రిపోర్టు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

BRS
బీఆర్​ఎస్

By

Published : Dec 27, 2022, 3:43 PM IST

BRS 2022 Audit Report : భారత్‌ రాష్ట్రసమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం ఏడాదిలో భారీగా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్‌ రిపోర్టు ప్రకారం పార్టీ ఆదాయం 2021-2022 మధ్యకాలంలో రూ.37.65 కోట్ల నుంచి రూ.218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల మేర ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details