ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాకరాపేట కనుమదారిలో రెండు వేరు వేరు చోట్ల ప్రమాదాలు - lorry accident in bhakrapeta kanuma latest

చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో రెండు వేరు వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఘటనలో లారీ అదుపు తప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడగా క్లీనర్​కు తీవ్ర గాయాలయ్యాయి.

two separate places in the Bhakarapeta canal
కనుమదారిలో రెండు వేరు వేరు చోట్ల ప్రమాదాలు

By

Published : Oct 25, 2020, 12:07 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో రెండు వేరు వేరు చోట్ల ప్రమాదాలు సంభవించాయి. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో... ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఘటనలో టమోటా లోడు తో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడింది. మదనపల్లి నుంచి చెన్నైకి టమోటా లోడుతో వెళ్తున్న లారీ ధనకోటి గంగమ్మ గుడి మలుపులో అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ నవీన్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా..... క్లీనర్ భాషా లారీలో ఇరుక్కుపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ లో ఇరుక్కున్న బాధితుడిని బయటకు తీసి 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details