చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి రాయచోటి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై వస్తున్న పశువుల్ని తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మస్తాన్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెకు ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి - చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మస్తాన్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి