చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పుతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై కాసిపెంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్ణాటకలోని ముల్బార్ ఘాట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరు నెల్లూరులోని రొట్టెల పండుగ చూసుకుని టెంపోలో తిరిగి వస్తుండగా.... వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా... మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టెంపో, ఆర్టీసీ బస్సు ఢీ- ఇద్దరు మృతి - టెంపును ఢీ కొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
నెల్లూరులో రొట్టెల పండగకు వెళ్లి టెంపోలో తిరిగి వస్తుండగా... కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.
టెంపును ఢీ కొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు