చిత్తూరు జిల్లా పీలేరు-రాయచోటి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. నివర్ తుపాను దెబ్బకు సొరకాయలపేట చెరువు కట్ట దెబ్బతిన్న కారణంగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కడప నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి బస్ షెల్టర్‌ను ఢీకొంది. అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదినారాయణ, సుభాష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్‌షెల్టర్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు - చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన ఘటన పీలేరు-రాయచోటి జాతీయ రహదారిపై జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ బస్‌షెల్టర్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదం