చిత్తూరు జిల్లా పరిధిలో ఉగాది నాటికి లక్షా 29 వేల మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల పంపిణీకి అర్హులుగా తేల్చారు. పట్టాల పంపిణీకి సుమారు 1,400 ఎకరాలు సేకరించారు. తరువాత ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. 90 రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ డిసెంబర్ 25న స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా జిల్లా పరిధిలో మరో 19 వేల మందిని అర్హులుగా తేల్చారు. ఇందులో తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని 17 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ముందుగానే అదనంగా 10 శాతం భూమిని సేకరించారు. తిరుపతి సబ్ డివిజన్లో మాత్రం అవసరమైన మేరకు భూమిని సేకరించి ప్లాట్లుగా మార్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ భూసేకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారుల కోసం భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతం చేశారు. సుమారు 285 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. తిరుపతిని ఆనుకుని ఉన్న రామచంద్రపురం మండలంలో 130 ఎకరాలు బీఎన్ కండ్రిగలో, 15 ఎకరాలు ఏర్పేడు పరిధిలో, పాగల్లో 140 ఎకరాలు సేకరించేందుకు పరిశీలించారు. భూసేకరణకు 32 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. నాలుగైదు రోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి:
ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణ వేగవంతం - ఇళ్ల పట్టాల పంపిణీ వార్తలు
ఇళ్ల స్థలాలు పంపిణీ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. తొలిదశలో ఎంపిక చేసిన వారితో పాటు ఆ తర్వాత 90 రోజుల వ్యవధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పుడు వీరికి పట్టాలు ఇచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ మొదలుపెట్టారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణ వేగవంతం