ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బసినికొండ వీఆర్వో - అనిశా అదుపులో బసినికొండ వీఆర్వో గంగాధర్ వార్తలు

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ వీఆర్వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. భూవివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వీఆర్వో గంగాధరం రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

acb takes banisikonda vro into custody
అనిశా వలలో మరో అవినీతి చేప

By

Published : Dec 5, 2020, 3:13 PM IST

అనిశా వలలో మరో అవినీతి చేప

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ వీఆర్వో గంగాధర్​ను అనిశా అధికారుల అదుపులోకి తీసుకున్నారు. బసినికొండకు చెందిన రామకృష్ణ అనే రైతు నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా... కొంతమంది మధ్యవర్తులు జోక్యం చేసుకుని దాన్ని రూ.5 లక్షలకు కుదించారు. అయితే రామకృష్ణ తన ఎకరం భూమి ఆన్​లైన్​ చేయడం కోసం.. కొంతకాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే అదనుగా భావించి వీఆర్వో రైతును లంచం డిమాండ్ చేశాడు. చేసేదిలేక బాధిత రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్నిన అధికారులు... వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details