acb raids : మహిళ రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటుండగా.. చిత్తూరు జిల్లా మాపాక్షి వీఆర్వో నౌజియాను అవినీతి నిరోధక శాఖ అధికారుల పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మహిళా రైతు భారతికి మూడు ఎకరాల పొలం ఉంది. ఆ సాగు భూమికి 1బీ అవసరం కాగా..సంబంధిత వీఆర్వో నౌజీయాను సంప్రదించారు. 1బీ ఇవ్వాలంటే రూ.3 వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో నెలల తరబడి ఆలస్యం చేసింది.
ఆశ పడింది... అడ్డంగా దొరికిపోయింది - అనిశాకు చిక్కిన వీఆర్వో
ACB RAIDS : చిత్తూరు జిల్లా మాపాక్షి వీఆర్వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ రైతు నుంచి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు.
ACB RIDES
వీఆర్వో ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ రైతు భారతి.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు ప్రణాళిక ప్రకారం.. చిత్తూరు తహశీల్దారు కార్యాలయంలో ఉన్న వీఆర్వో నౌజియా.. రైతు భారతి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి