చిత్తూరులోని రహదారులు, భవనాల శాఖ… చిత్తూరు డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల వివరాలు, మంజూరు చేసిన బిల్లులు, పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. సోదాలు జరుగుతున్న సమయంలో కార్యాలయ సిబ్బందిని బయటకు పంపించలేదు. అనిశా సీఐ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.
చిత్తూరు డివిజన్ ఆర్ అండ్ బీ ఇంజినీరు కార్యాలయంలో సోదాలు - ACB Raids in Chittoor division Executive engineer office news
చిత్తూరు జిల్లాలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్తూరు డివిజన్ ఆర్ అండ్ బీ కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో ఏసీబీ సీఐ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.
![చిత్తూరు డివిజన్ ఆర్ అండ్ బీ ఇంజినీరు కార్యాలయంలో సోదాలు ACB Raids in R and B Office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:17:25:1599565645-ap-tpt-17-08-acb-rides-road-building-office-av-ap10008-08092020165801-0809f-1599564481-23.jpg)
చిత్తూరులో ఏసీబీ సోదాలు