ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్ తో వెతలు: ప్రాణం మీదకు తెస్తున్న కంచెలు - చిత్తూరు జిల్లాలో పాముకాటు వార్తలు

చిత్తూరు జిల్లా కలకడ మండల పరిధిలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు వేసుకున్న కంచెలు.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

young woman suffering a snake bite
కరోనా కారణంగా రహదారికి కంచెవేసిన దృశ్యం

By

Published : Apr 28, 2020, 12:21 PM IST

చిత్తూరు జిల్లా కలకడ మండలం కోన పంచాయతీ పరిధిలోని గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన రెడ్డి రేవతి అనే యువతి ఆదివారం అర్ధరాత్రి పాము కాటుకు గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు వాహనంలో బయల్దేరారు. తీరా ఎస్‌.సోమవరం క్రాస్‌వద్దకు రాగానే దారికి కంచె వేశారు. కనీసం కంచె తొలగించి వెళ్లలేని పరిస్థితి.

సుమారు 25కిలో మీటర్ల దూరం ప్రయాణించి జాతీయ రహదారికి చేరుకుని పీలేరుకు వెళ్లారు. యువతి పరిస్థితి విషమించగా తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. తిరుపతికి వెళ్లే సరికిఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వైద్యులు 12 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచారు. ఆ యువతి ఇప్పుడిప్పుడే కొలుకుంటోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details