చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండల పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం మదనపల్లె ఇందిరా నగర్ కు చెందిన కొందరు యువకులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. మొరవలోని లోతైన ప్రాంతంలో యువకులు దూకగా ఈత రాకపోవడం వల్ల జమీర్ భాషా(18) నీళ్లలో మునిగి పోయాడు. స్నేహితులు ఎంత ప్రయత్నం చేసినా కాపాడలేకపోయారు.
పెద్దేరు జలాశయంలో పడి యువకుడు మృతి - thamballapalle latest news
సరైన అవగాహన లేక , ఈత రాకపోయినా పర్యటకులు నీళ్లలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం పెద్దేరు ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.
పెద్దేరు జలాశయంలో పడి యువకుడు మృతి
సోమవారం ఉదయం తంబళ్లపల్లి తహసీల్దార్ రవీంద్రారెడ్డి, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ సహదేవి ఘటనాస్థలానికి చేరుకున్నారు. జమీర్ భాషా మృతదేహం నీటిలో తేలింది. జలాశయం లోపలికి పర్యాటకులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి