యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమంటూ సెల్ఫీ - selfi video
ఏ తప్పూ చేయకపోయినా ఓ పోలీస్ అధికారి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఓ యువకుడు మనస్థాపం చెందాడు. తన బాధను వీడియోలో రికార్డు చేసి ఆత్మహత్యాయత్నం చేశాడు.
![యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమంటూ సెల్ఫీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4214676-215-4214676-1566498041863.jpg)
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంగిలపట్టు గ్రామానికి చెందిన యువకుడు.. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఏ తప్పు చేయకపోయినప్పటికీ తనను చంద్రగిరి ఎస్సై రామకృష్ణ వేధిస్తున్నాడని రమేశ్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ఆవేదనను ఫోన్లో రికార్డు చేశాడు. గతంలో జరిగిన ఓ వివాదాన్ని మనసులో పెట్టుకుని ఎస్సై తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. పోలీస్స్టేషన్లో ఉంచి చిత్రహింసలకు గురిచేశాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు వాట్సాప్లో పంపాడు. అప్రమత్తమైన స్నేహితులు అతన్ని గుర్తించి హుటాహుటిన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.