చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తుమ్మలగొంది గ్రామానికి చెందిన స్వర్ణలత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం కలిగారని.. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అయితే స్వర్ణలతకు ఇది మూడో కాన్పు. అంతకు ముందు జరిగిన రెండు కాన్పుల్లో ఇద్దరు ఆడపిల్లలు కలిగారని ఆమె తెలిపింది.
ఒకే కాన్పులో ముగ్గురు సంతానం.. తల్లీపిల్లలు క్షేమం - గుర్రంకొండలో ఒకే కాన్పులో పుట్టిన ముగ్గురు పిల్లలు
ఓ మహిళ సాధారణంగా ఒకేసారి ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలదు. కానీ ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చూపినట్లు.. ఒక్కొకసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.
![ఒకే కాన్పులో ముగ్గురు సంతానం.. తల్లీపిల్లలు క్షేమం three children born at a time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10786309-24-10786309-1614337681707.jpg)
ఓ కాన్పులో ముగ్గురు సంతానం..