ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమెరికాలో చిత్తూరు మహిళ మృతి... తల్లిదండ్రుల అనుమానం - అమెరికాలో చిత్తూరు మహిళ మృతి

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత అనే మహిళ మృతిచెందారు. ఆమె మృతి పట్ల తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె చివరిచూపునకు నోచుకోకుండా ఆమె భర్త వ్యవహరిస్తున్నాడని.. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రేమలత తల్లిదండ్రులు కోరుతున్నారు.

a woman killed in America
అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి.. తల్లిదండ్రుల అనుమానం

By

Published : Dec 4, 2020, 10:55 PM IST

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత. భర్త సుధాకర్​తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటుంది. భర్త సుధాకర్ సాఫ్ట్​వేర్ ఉద్యోగి. వీళ్లకు గీతాంష్ అనే రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. అయితే మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.

ప్రేమలతది ఆత్మహత్య కాదని.. ఆమె భర్త సుధాకరే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించడానికి సుధాకర్ నిరాకరిస్తున్నాడని ఆరోపించారు. కుమార్తెను చివరిచూపుకు నోచుకోనియకుండా ఆమె భర్త వ్యవహరిస్తున్నాడని.. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రేమలత తల్లిదండ్రులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details