ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందూ నదిలో మహిళ మృతదేహం వెలికితీత - చిత్తూరు జిల్లా కందూనదిలో మహిళా మృతదేహం లభ్యం

చిత్తూరు జిల్లాలోని కుందూనదిలో గుర్తుతెలియని ఓ వివాహిత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

woman dead body found at kundu river
కుందూనదిలో గుర్తుతెలియని వివాహిత మృతదేహం గుర్తింపు

By

Published : Dec 6, 2020, 3:47 PM IST

చిత్తూరు జిల్లా ఖాజీపేట మండలం మిడుతూరు వద్ద కుందూనదిలో గుర్తుతెలియని ఓ వివాహిత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సిబ్బందితో కలిసి ఎసై అరుణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

శనివారం రాత్రి చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళ ఆత్యహత్య చేసుకుందా? లేక ఎవరైనా నదిలో పడేశారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details