ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం.. గుంతలో పడిన టిప్పర్​ - Puthalapattu- Naidupet national highway news

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై టిప్పర్​ అదుపు తప్పి గోతిలో పడింది. రోడ్డు విస్తరణ పనుల్లో గుత్తేదారులు సరైన భద్రతా చర్యలు పాటించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

accident
అదుపుతప్పి గుంతలో పడిన టిప్పర్​

By

Published : Mar 30, 2021, 8:22 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద టిప్పర్ అదుపు తప్పి గోతిలో పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. చంద్రగిరి నుంచి మెటల్ లోడుతో తిరుపతి వైపు వెళ్తున్న వాహనం తొండవాడ వద్ద అదుపు తప్పింది. ఆర్చి కోసం తీసిన గోతిలో పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. టిప్పర్​ క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను సురక్షితంగా బయటకు తీశారు.

ప్రమాదానికి గురైన వాహనం కెఎన్ఆర్ కన్​స్ట్రక్షన్స్​కు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూతలపట్టు - నాయుడుపేట మధ్య 6 వరసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సరైన భద్రతా చర్యలు తీసుకోని కారణంగానే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details