చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతచెందాడు. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు.. బుధవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్ళి చూడగా మృతి చెందాడు. మృతుడి ఛాతిపైన బలమైన గాయం కావడంతో అనుమానించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏ.రంగంపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి - చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
చిత్తూరు జిల్లా ఏ.రంగంపేటలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏ.రంగంపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి