ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్ ఆటలు.. తీశాయి ప్రాణాలు..! - student sucide in tirupathi with online betting news

సరదాగా ఆడిన ఆట ప్రాణాలు తీసింది. ఆన్​లైన్ గేమ్.. తల్లిదండ్రులకు నానా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కంటి చూపు సరిగా.. లేకున్నా.. చదువులో ముందుండే ఆ విద్యార్థి జీవితం అర్థంతరంగా ముగిసింది.

ఆన్​లైన్ ఆటలు.. తెచ్చాయి ప్రాణాలకు ముప్పు!
ఆన్​లైన్ ఆటలు.. తెచ్చాయి ప్రాణాలకు ముప్పు!

By

Published : Dec 1, 2020, 8:33 PM IST

Updated : Dec 1, 2020, 10:09 PM IST

ఆన్​లైన్ ఆటలు.. ఓ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురి చేశాయి. ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీాశాయి. విద్యలో ముందుండే ఆ విద్యార్థి విధిని చీకటి చేశాయి.

ఇంతకీ ఏమైందంటే..

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచికాపలం గ్రామానికి చెందిన యోగేశ్ ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడికి కంటి చూపు సరిగా లేదు. అయినా చదువులో ముందుంటాడు. ప్రభుత్వ పింఛను కూడా పొందుతున్నాడు. కరోనా కారణంగా లాక్​డౌన్​లో ఇంట్లోనే ఉంటూ.. సెల్​ఫోన్ వాడటం ఎక్కువైంది. అలా యోగేశ్​కు ఆన్​లైన్​ ఆటలపై మక్కువ పెరిగింది. లాన్​డౌన్​లో ఇంటిపట్టునే ఉంటూ చరవాణి ద్వారా ఆన్​లైన్ ఆటలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే బెట్టింగ్​లు మెుదలుపెట్టాడు. డబ్బులు వస్తున్నాయనుకున్న యోగేశ్​.. అప్పులపాలయ్యాడు.

ఏం చేయాలో యోగేశ్​కు అర్థం కాలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బిడ్డపై మమకారంతో.. మానసికంగా బాధపడుతున్నాడని.. 2 లక్షలు చెల్లించారు. అయినా యోగేశ్​కు అప్పుల బాధ తప్పలేదు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన అతను.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లి కేకలు వేసింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. యోగేశ్​ను తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. యోగేశ్ మృతి చెందాడు.

ఇదీ చదవండీ...ఓంకార క్షేత్రంలో అర్చకుల సంఘం ఆందోళన

Last Updated : Dec 1, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details