ఇవీ చూడండి
పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం.. నూతన పార్లమెంట్‌లో మట్టి కళాకృతులు ప్రదర్శన - పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం
చిత్తూరు జిల్లా పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. వారు తయారు చేసిన కళా ఖండాలు నూతన పార్లమెంట్ భవనంలో అలంకరణ, ప్రదర్శనకు ఎంపికయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి టెర్రకోట పోటరీ కళాకారులు పోటీ పడగా.. రాజస్ధాన్, పశ్చిమ బంగాల్, ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వాటిని మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. పలమనేరులో తయారైన 8 కళా ఉత్పత్తులను పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నారు. టెర్రకోట పోటరీ కళాకారుల నైపుణ్యం, వారు తయారు చేసిన వస్తువుల నాణ్యతపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం