అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి - latest crime news in chittoor district
అప్పుల వాళ్లు తనను వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగింది.
అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ముద్దనపల్లికి చెందిన నారాయణ స్వామి అప్పుల వాళ్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అతనికి పోలీసులు సర్ది చెప్పి కిందకి దించారు.