ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడికి కరోనా.. మనోవేదనతో తండ్రి మృతి - Father dies with son Infected by Corona

కన్న కుమారుడు, కోడలుకి దూరంగా ఉంటున్నాడు ఆ తండ్రి. కో అప్టెక్స్​ సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన స్వగ్రామంలో.. సొంతంగా ఓ జిరాక్స్ దుకాణ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంతలోనే కుమారుడికి కరోనా సోకిందన్న వార్త.. అతని గుండెలను ఆగేలా చేసింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

covid
covid

By

Published : Jul 1, 2020, 5:54 PM IST

చిత్తూరు జిల్లా ఏకాంబర కుప్పంలో విషాదకర సంఘటన వెలుగు చూసింది. కుమారుడికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఓ వృద్ధుడు మనోవేదనతో గుండె ఆగి చనిపోయారు. కో అప్టెక్స్‌ సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆయన... స్వగ్రామం వెదురుకుప్పంలో జిరాక్స్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ట్రావెల్స్​లో డ్రైవర్​గా

ప్రైవేటు ట్రావెల్స్‌ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్న వృద్ధుడి కుమారుడు కరోనా బారిన పడ్డారు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తండ్రికి తెలియటంతో గుండెపోటుతో మృతి చెందాడు. అయితే కరోనా భయంతో వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకురాలేదు.

ఎస్పీ ఆదేశాలతో అంత్యక్రియలు

వృద్ధుడు గుండెపోటుతో మరణించడం....కరోనా భయంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకురాని విషయం జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లింది. స్పందించిన చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్పీ సూచనల మేరకు నగరి సీఐ మద్దయ్యాచారి తన సిబ్బందితో వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటుకున్న పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:108 వాహనాల కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధమా.?: శ్రీకాంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details