చిత్తూరు జిల్లా పలమనేరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఐరాల మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన మనోహర్ గత నాలుగు సంవత్సరాలుగా పారిశ్రామికవాడలో వైర్ నెట్ మగ్గాలలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రాత్రి మనోహర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మూడు అడుగులు కూడా లేని ఓ చెట్టు కొమ్మకు ఉరి వేసుకొని ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలమనేరులో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి - ఐరాల మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన మనోహర్
పలమనేరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పలమనేరులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి ....