చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రాయలవారికోట గ్రామానికి చెందిన దినసరి కూలీ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రాయలవారి కోటలో నివాసముండే శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకునే శేఖర్ స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - death news in chittoor dst
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రాయలవారికోట గ్రామంలో ఓ వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
a man committed suicide in chittoor dst chandragiri mandal reasons not known