ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ ఫక్కీలో దోపిడీ..సెల్​ఫోన్ల లోడు లారీ అపహరణ - chittor crime news

చిత్తూరు జిల్లా నగరి సమీపంలో సినీ ఫక్కీలో సెల్​ఫోన్ల లోడుతో వెళ్తున్న లారీని దుండగులు అపహరించారు. సుమారు 7 కోట్ల రూపాయల విలువైన సెల్​ఫోన్లను దోచుకెళ్లారు. లారీ డ్రైవర్​ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A lorry with a load of cell phones was stolen in chittor district
A lorry with a load of cell phones was stolen in chittor district

By

Published : Aug 26, 2020, 5:43 PM IST

Updated : Aug 26, 2020, 5:56 PM IST

చిత్తూరు జిల్లా నగరి సమీపంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. సెల్ ఫోన్లను రవాణా చేస్తున్న ఓ లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబదూరు నుంచి ముంబయిలోని గోదాంకి సెల్​ఫోన్లు తీసుకెళ్తున్న లారీని... ఏపీ సరిహద్దు వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లారీ డ్రైవర్ తెలిపాడు. తన కాళ్లు చేతులు కట్టి కింద పడేసి... లారీని తీసుకుని వెళ్లిపోయారని చెప్పాడు.

సినీ ఫక్కీలో దోపిడీ..సెల్​ఫోన్ల లోడు లారీ అపహరణ

పుత్తూరు మరాఠి గేట్ దగ్గర జాతీయ రహదారి పక్కన లారీని పోలీసులు గుర్తించారు. లారీలో మొత్తం 16 బాక్సుల్లో సుమారు 15వేల సెల్ ఫోన్​లు ఉండగా.. అందులో 8 బాక్స్​ల సెల్​ఫోన్లను వేరే లారీలోకి మార్చుకుని ఉంటారని నగరి పోలీసులు భావిస్తున్నారు. అపహరించిన సెల్​ఫోన్​ల విలువ సుమారు 7 కోట్ల రూపాయలు వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అపహరణకు గురైన లారీని పోలీసులు పరిశీలన
అపహరణకు గురైన లారీ
Last Updated : Aug 26, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details