ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెటిరో పరిశ్రమలో చిరుత.. ముప్పు తిప్పలు పెట్టి.. ఆఖరికి చిక్కిందిలా! - Leopard roaming in sangareddy district

Leopard in Hetero industry: సంగారెడ్డి హెటిరో పరిశ్రమలోకి వెళ్లిన చిరుతను ఎట్టకేలకు బంధించారు. నెహ్రూ జూపార్క్‌ ప్రత్యేక బృందం సభ్యులు పలు విధాల శ్రమించి.. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అది మత్తులోకి జారుకున్నాక.. దాన్ని బంధించారు.

Leopard in Hetero industry
Leopard in Hetero industry

By

Published : Dec 17, 2022, 5:06 PM IST

Leopard in Hetero industry: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత కలకలం రేపింది. తెల్లవారుతున్న సమయంలో చిరుత హెటిరో పరిశ్రమలో హెచ్​బ్లాక్‌లోకి ప్రవేశించింది. అయితే పలు విధాల శ్రమించి.. నెహ్రూ జూపార్క్‌ ప్రత్యేక బృందం చిరుతను బంధించింది. గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌కు వచ్చిన చిరుత.. ఉదయం 4 గం.కు హెటిరో ల్యాబ్‌ హెచ్‌ బ్లాక్‌లోకి వెళ్లింది.

చిరుతను గమనించిన కార్మికులు.. బయటకు వచ్చి గదికి తాళం వేశారు. అనంతరం చిరుతను బంధించడానికి నెహ్రూ జూపార్క్‌ ప్రత్యేక బృందం వచ్చింది. చిరుతను బంధించేందుకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చింది నెహ్రూ జూపార్క్‌ బృందం. చిరుత మత్తులోకి జారుకోగానే ప్రత్యేక బృందం బంధించింది.

హెటిరోలోకి చిరుత.. ఆఖరికి చిక్కిందిలా!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details