lecturer forcibly married a student: చదువుకునేందుకు కళాశాలకు వచ్చిన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ గురువు.. తప్పుడు మార్గం పట్టాడు. అప్పటికే తనకు పెళ్లాయి, ఓ కుమార్తె కూడా ఉన్నప్పటికీ కామ ఆలోచనలతో.. తాను నిజాయితీపరుడనని, తనను నమ్మితే జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినికి ఇష్టంలేకపోయిన తిరుపతికి తీసుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనా కొద్దిసేపటికి ఆ అధ్యాపకుడి నిజస్వరూపాన్ని పసిగట్టిన బాలిక.. జరిగినదంతా తల్లిదండ్రులకు తెలియజేసింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అధ్యాపకుడి అసలు బాగోతం బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన చలపతి (33) అనే వ్యక్తి గతకొన్ని సంవత్సరాలగా శ్రీ వాణి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తీస్తున్నాడు. ఈ క్రమంలో అదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినితో (బాలిక) చనువుగా ఉండటం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో రోజు రోజు ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్తూ రోజులు గడిపాడు.
ఈ క్రమంలో తాజాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షను రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత తాను నిజాయితీగా ఉండే వ్యక్తినని, తనను నమ్మి పెళ్లి చేసుకుంటే సంతోషంగా చూసుకుంటానని పలు రకాల హామీలతో ఆ బాలికను నమ్మించాడు. అనంతరం అక్కడే ఓ ఆలయంలో ఆ బాలిక మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిసేపటికి లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించింది. అతడు చెప్తున్న మాటలకు పొంతన లేకపోవడంతో తనను మోసం చేశాడని గ్రహించి బోరున కన్నీరుమున్నీరయ్యింది.