తిరుమల పాపవినాశనం రహదారిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో రహదారి పైకి వచ్చిన గజరాజుల గుంపును చూసి యాత్రికులు భయంతో పరుగులు తీశారు. శ్రీగంధం వనంలోకి ప్రవేశించిన ఏనుగులు వనంలోని చెట్లను విరిచి ధ్వంసం చేశాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వాటిని అడవిలోకి పంపే ప్రయత్నాలు చేశారు.
తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం.... ఆందోళనలో భక్తులు - A group of elephants wandering around in Tirumala ... devotees in panic
తిరుమలలో వన్యప్రాణుల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. చిరుతలు, ఏనుగులు వంటివి ఆలయ పరిసరాల్లో సంచరించడం నిత్యకృత్యమయ్యాయి. తాజాగా వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో ఏనుగులు గుంపు సంచారం భక్తులను భయాందోళనకు గురిచేశాయి.
తిరుమలలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు... భయాందోళనలో భక్తులు