ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సార్​... మా అమ్మని ఇండియాకు రప్పించండి' - సౌదీలోని తల్లి వార్తలు

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన తన తల్లిని... స్వగ్రామానికి రప్పించాలని ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.

a girl complained to police  for  to bring her mother from saudhi
మీడియాతో మాట్లాడుతున్న సుకన్య

By

Published : Jan 13, 2020, 5:09 PM IST

'సార్​... మా అమ్మని ఇండియాకు రప్పించండి'

పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన రాధ 3 ఎళ్ల కిందట బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. తన తల్లి ఏడాది నుంచి మాట్లాడటం లేదని రాధ కూతురు సుకన్య ఏజెంట్​ను సంప్రదించింది. ఏజెంట్ కూడా నమ్మలేని మాటలు చెప్పాడు. దీంతో సుకన్య పోలీసులను ఆశ్రయించింది. స్థానిక డీఎస్పీ ఆదేశాల మేరకు ఏజెంట్​ను స్టేషన్​కు పిలిపించి పోలీసులు విచారించారు. నెల రోజుల్లో రాధను స్వగ్రామానికి రప్పించాలని చెప్పారు. తన అమ్మ ఏడాదిగా కాలంగా సరిగా మాట్లాడటం లేదని... వాట్సప్​లో పంపిన మాటలు తన తల్లి కావని సుకన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాధ కూతురు సుకన్య మదనపల్లెలోని అమ్మమ్మ నరసమ్మ వద్ద ఉంటూ... డిగ్రీ చదువుతోంది. సుకన్య తండ్రి పాపన్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందాడు.

ABOUT THE AUTHOR

...view details